ETV Bharat / state

'మంత్రి వర్గ విస్తరణపై అసంతృప్తి లేదు'

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. తాను అసంతృప్తి చెందినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించారు. తెరాసలోకి తాను పదవుల కోసం రాలేదని... సీఎం కేసీఆర్​ నాయకత్వంపై ఆకర్షితులై మాత్రమే వచ్చానని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
author img

By

Published : Sep 10, 2019, 10:02 PM IST

తెరాస పార్టీకి తాను పదవుల కోసం రాలేదని... ముఖ్యమంత్రి కేసీఆర్​ నాయకత్వం పట్ల ఆకర్షితులై వచ్చానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై తాను అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. వివిధ సమీకరణాలు, ప్రభుత్వ అవసరాల నేపథ్యంలో మంత్రులు ఎవరని నిర్ణయించే అధికారం పూర్తిగా కేసీఆర్​కే ఉందని పేర్కొన్నారు. తన భార్య గండ్ర జ్యోతికి జడ్పీ ఛైర్ పర్సన్ పదవి రావడం సీఎం ఆశీస్సుల వల్లేనని తెలిపారు. తాను అనని మాటలను కొన్ని పత్రికలు రాయడం మంచిది కాదని అన్నారు. వార్త విలువలను వదిలేసి అసత్యాలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

తెరాస పార్టీకి తాను పదవుల కోసం రాలేదని... ముఖ్యమంత్రి కేసీఆర్​ నాయకత్వం పట్ల ఆకర్షితులై వచ్చానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై తాను అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. వివిధ సమీకరణాలు, ప్రభుత్వ అవసరాల నేపథ్యంలో మంత్రులు ఎవరని నిర్ణయించే అధికారం పూర్తిగా కేసీఆర్​కే ఉందని పేర్కొన్నారు. తన భార్య గండ్ర జ్యోతికి జడ్పీ ఛైర్ పర్సన్ పదవి రావడం సీఎం ఆశీస్సుల వల్లేనని తెలిపారు. తాను అనని మాటలను కొన్ని పత్రికలు రాయడం మంచిది కాదని అన్నారు. వార్త విలువలను వదిలేసి అసత్యాలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : "కేసీఆర్ నన్ను ఉద్యమబిడ్డగా తీర్చిదిద్దారు"

Intro:jk_tg_mbnr_04_10_jurala_kudi_kalvaku_niru_pkg_ts10096
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది దీంతో జూరాల ఎడమ కుడి కాలువలకు నీరు పుష్కలంగా ప్రవహిస్తుంది ముఖ్యంగా జూరాల కుడి కాల్వకు నీరు విడుదల చేయడంతో గత పది రోజులుగా ఆర్ డి ఎస్ చివరి ఆయకట్టు కింద ఉన్న మానవపాడు ఉండవల్లి అలంపూర్ మండలాల్లో ఉన్న కాలువలకు నీరు ప్రవహిస్తున్నది చాలా ఏళ్ల తర్వాత కాలువకు నీళ్లు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు


Body:జూరాల కుడి కాలువను 1995లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇటిక్యాల మండలం వేముల దగ్గర చివరి డిస్ట్రిబ్యూటర్ 38 ఆర్డీఎస్ కాలువకు అనుసంధానం చేశారు దీంతో దిగువన ఉన్న అలంపూర్ వరకు నీరు పారేది రైతులు పుష్కలమైన నీటి తో వేరుశనగ మిరప పత్తి ఉల్లి పొగాకు మొదలైన పనులను సాగు చేసేవారు కాలానుగుణంగా జూరాల కుడి కాలువకు నీళ్లు తక్కువగా వస్తుండడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావడం ఆగిపోయింది ఇదే కాకుండా పైన ఉన్న నాన్ ఆయకట్టు రైతులు కాలువకు ఎక్కడికక్కడ వందల మోటర్లు ఏర్పాటు చేసుకోవడంతో కిందకు అరకొర నీరు రావడం మొదలైంది అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కాలువల పూడిక చెట్లతో నిండిపోయింది దీంతో కింద ఉన్న కాల్వ రైతులకు చుక్క నీరు కూడా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది ఆర్డీఎస్ నీటి తో పాటు జూరాల నీరు కూడా రాకపోవడంతో రైతులు ఎక్కువగా వర్షాధార పంటల పైనే ఆధారపడడం మొదలెట్టారు మరల ఎగువన కురుస్తున్న వర్షాలకు ఈ సంవత్సరం గత పది రోజులుగా కాలువకు నీరు రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి


Conclusion:ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టిసారించి వందల కోట్లు ఖర్చు పెడుతున్నది అందులో కొద్ది మొత్తంలో ఖర్చు చేస్తే 25 వేల ఎకరాలకు పుష్కలమైన సాగునీరు అందుతుందని రైతులు ఆశా భావం వ్యక్తం చేశారు రెండు నదుల మధ్య ఉన్న నడిగడ్డ ప్రాంతం తాగు సాగునీటికి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుకుంటున్నారు ఒకవైపు తుమ్మిళ్ళ మరోవైపు జూరాల కుడికాలువ ద్వారా ఆర్డీఎస్ కు పుష్కలంగా నీరు అందిస్తే బాగుంటుందని కోరారు వర్షాలు పడినప్పుడు మాత్రమే జూరాల కుడి కాలువకు నీరు వదులుతున్నారని అలా కాకుండా కాలువల ఆధునీకరణ చేసి పైభాగంలో జల చౌర్యం కాకుండా అధికారులు పర్యవేక్షించి కాలువకు ఎక్కడికక్కడ సెంటర్లను ఏర్పాటు లైనింగ్ లు సరిచేస్తే చివరి ఆయకట్టుకు నీరు అందుతుందని కోరుకుంటున్నారు కాలువలు ఉన్నాయి చిన్న చిన్న పనులు సరిచేస్తే 25 వేల నుంచి 30 వేల ఎకరాల వరకు నీరు ఫారిచుకునే అవకాశం ఉంది అయినా దీనిపై అధికారులు గాని ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వం గానీ దృష్టి పెట్టకపోవడం శోచనీయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సారవంతమైన భూములు ఉండి కూడా పండించుకో లేని స్థితిలో ఆయకట్టు రైతులు ఉన్నారని తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.