ఎన్నికల్లో గెలుపోటములు సర్వ సాధారణమని రాష్ట్ర పశు సంవర్థక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ అంబర్ పేటలోని త్రిశూల్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ తెరాస ఎంపీగా పోటీ చేసిన మంత్రి కుమారుడు సాయి కిరణ్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ హవాతో ఇక్కడ భాజపా గెలిచిందని అభిప్రాయపడ్డారు. ఇక పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. తన కుమారుడు గెలవాలని కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఇక ప్రజలతో మమేకమవుతామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : "కరవు నేలపై గంగమ్మ ఉరకలెత్తాలి"