తెలంగాణలో నేతన్నకు చేయూత పథకం పునరుద్ధరణకు... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.30 కోట్లు విడుదల చేశారు. దీనికోసం మొత్తం రూ.368 కోట్లు కేటాయించి... మొదటి విడతగా రూ.30 కోట్లు విడుదల చేసింది. ఈ కార్యక్రమంపై తెరాస నేత ఎల్. రమణ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆర్ధిక సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అదనంగా రూ.30 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చారని తెలిపారు.
ఇది పొదుపు, ఆర్థిక భద్రతతో కూడిన పథకం. నేతన్నకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. రైతులకు భరోసా ఇచ్చినట్లే చేనేత కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంది. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు.
-ఎల్.రమణ, తెరాస నేత
రైతుల మాదిరిగానే చేనేత కళాకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత భీమా ప్రకటించడంతో... చేనేత వర్గాలలో భరోసా కలిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలతో.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని రమణ పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: nethannaku cheyutha scheme : నేతన్న చేయూతకు తొలి విడతగా రూ.30 కోట్లు