ETV Bharat / state

'ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి' - trs comments on congress mps speech

రాష్ట్రంలో కాంగ్రెస్​ నాయకులు ప్రజల విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెరాస మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​ అన్నారు. హస్తం నేతలు పార్లమెంటులో విభజన అంశాలను ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్​ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాడాలని సూచించారు.

బూర నర్సయ్య గౌడ్​
author img

By

Published : Jul 9, 2019, 7:39 PM IST

రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఎద్దేవా చేశారు తెరాస మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​. హైదరాబాద్​ తెలంగాణ భవన్​లో మాట్లాడిన ఆయన హస్తం నేతలు పార్లమెంటుకు, అసెంబ్లీకి తేడా లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంపీలు గల్లీలో మాట్లాడే అంశాలను దిల్లీలో ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో ముఖ్యమంత్రి కేసీఆర్​ను విమర్శించడం తగదన్నారు. రాష్ట్ర విభజన అంశాలపై భాజపాను ప్రశ్నించే దమ్ము లేదని విమర్శించారు. ప్రజలు గెలిపించినందుకు వారి నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు.

కాంగ్రెస్​ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డ బూర నర్సయ్యగౌడ్​

ఇదీ చూడండి : "కోమటిరెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.