ETV Bharat / state

Trs Complaint To Ec: 'ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు' - Huzurabad by election

హుజూరాబాద్ బై ఎలక్షన్​లో భాజపా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని అధికార తెరాస ఈసీకి (Trs Complaint To Ec) ఫిర్యాదు చేసింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్​ను కలిసి ఆ పార్టీ నేతలు వినతిపత్రం ఇచ్చారు.

Trs Complaint To Ec
ఈసీ
author img

By

Published : Oct 13, 2021, 9:38 PM IST

హుజూరాబాద్​ ఉపఎన్నిక(Huzurabad by election 2021)లో భాజపా నేతలు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ (Trs Complaint To Ec) జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని తెరాస నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బుద్ధభవన్​లో ఎన్నికల ప్రధాన అధికారి డా.శశాంక్ గోయల్ (Ec Shashank Goyal)​ను తెరాస నేతలు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కలిసి వినతిపత్రం ఇచ్చి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి చట్టాన్ని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచారాలు చేస్తున్నారని ఈ అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు.

తెరాస నేతలు డబ్బులు పంచుతున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సింది పోయి.. ఎన్నికల్లో పైసలు తీసుకొని భాజపాకు ఓటు వేయండని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తే స్పందన రాలేదు.. కాబట్టి ఎన్నికల ప్రధానాధికారికి అన్ని ఆధారాలు అందజేసి ఫిర్యాదు చేశామన్నారు.

ఎన్నికల అధికారి షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా జరిగే ఎన్నికలను హింసాత్మకంగా మార్చి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనే కుట్ర పన్నటం తగదన్నారు. ఈ విషయంలో ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదివరకే...

హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్... ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని (Trs Complaints On Etela) కేంద్ర ఎన్నికల సంఘానికి ఇదివరకే తెరాస (Trs) నాలుగు ఫిర్యాదులు సమర్పించింది. రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మరణించగా.. ఆ ఘటనతో ఎలాంటి సంబంధంలేని ఎమ్మెల్యే బాల్క సుమన్​ను తప్పుడు కేసులో ఇరికించేందుకు భాజపా, ఈటల రాజేందర్ ప్రయత్నించారని తెరాస ఆరోపించింది.

తెరాస విద్యార్థి విభాగం నాయకుడు జగన్​పై భాజపా నాయకులు హత్యాయత్నం చేశారని ఫిర్యాదుల్లో పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన హుజూరాబాద్​లో ఈటల రాజేందర్ రోడ్ షో (Etela Rajender Road show) నిర్వహించారని మరో ఫిర్యాదులో అధికార పార్టీ ఆరోపించింది. దసరా సందర్భంగా ఓటర్లకు తెరాస వేల రూపాయలు, మాంసం పంచుతోందని వాటిని తీసుకొని ఓటు మాత్రం తనకే వేయాలని ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనలపై విచారణకు ఆదేశించి భాజపా, ఈటల రాజేందర్​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులతో పాటు పలు వీడియోలను సమర్పించారు.

ఇదీ చదవండి: Ayudha puja: ఆయుధ పూజలో పాల్గొన్న సీపీలు.. గాల్లోకి కాల్పులు జరిపిన మహేశ్​ భగవత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.