జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. బేగంపేట డివిజన్‌కు చెందిన తెరాస అభ్యర్థి మహేశ్వరి, బన్సీలాల్‌పేట్‌లో హేమలత తమ ప్రచారాలను ప్రారంభించారు. బ్రాహ్మణ వాడి, మాతాజీనగర్, బేగంపేట తదితర ప్రాంతాల్లో మహేశ్వరి తిరుగుతూ... ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.
ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆమె హితవు పలికారు. స్థానిక సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు.