మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మృతితో దిగ్భ్రాంతికి లోనైన తెలంగాణ సీనియర్ ఉద్యమ కార్యకర్త బీవీ రమణ.. నాయిని చిత్ర పటం వద్ద బోరున విలపించారు. అంబర్ పేటలోని అలీ కేఫ్ చౌరస్తాలో నాయిని చిత్ర పటానికి తెరాస నాయకులు చేగూరి రఘు బాబు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఉద్యమ సమయంలో తనకు మనోధైర్యాన్ని ఇస్తూ నాయిని చెప్పిన మాటలను రమణ గుర్తు చేసుకున్నారు. ఉద్యమ కార్యకర్తలని పట్టించుకునేవారు లేరనీ, కష్టం వచ్చినప్పుడు ధైర్యం ఇచ్చే నాయిని నర్సన్న ఇక లేరని తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నాగరాజు బినామీ లాకర్లో 1256 గ్రాముల బంగారం