ETV Bharat / state

JAGAN CASES: జగతి పబ్లికేషన్స్, వాన్​పిక్ ఛార్జ్​షీట్లపై విచారణ గురువారానికి వాయిదా - జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో విచారణ

సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఇందూ టెక్​ జోన్ కేసులో విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఛార్జ్​షీట్ నుంచి తనను తొలగించాలని బీపీ ఆచార్య కోరారు. తదుపరి విచారణ నాటికి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలుకు జగన్ సమయం కోరారు.

JAGAN CASES
JAGAN CASES
author img

By

Published : Jun 23, 2021, 10:24 PM IST

సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఇందూ టెక్​ జోన్ కేసులో విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఛార్జ్​షీట్ నుంచి తనను తొలగించాలని బీపీ ఆచార్య కోరారు. తదుపరి విచారణ నాటికి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలుకు జగన్ సమయం కోరారు. డిశ్ఛార్జ్​ పిటిషన్ల దాఖలుకు ఎంపీ విజయసాయిరెడ్డి, కార్మెల్ ఏషియా కంపెనీ కూడా సమయం కోరారు. జగన్, విజయసాయిరెడ్డి వినతితో ఏకీభవించిన న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది.

రఘురాం సిమెంట్స్ కేసులో వాదనలకు వి.డి రాజగోపాల్ సమయం కోరారు. ఈ ఛార్జ్​షీట్ పై విచారణను జూలై 1 కి కోర్టు వాయిదా వేసింది. పెన్నా సిమెంట్స్ కేసు అభియోగాల నమోదుపై జగతి పబ్లికేషన్స్ వాదనలు వినిపించింది. వాదనల కొనసాగింపు కోసం విచారణ రేపటికి వాయిదా వేసింది. జగతి పబ్లికేషన్స్, వాన్​పిక్ ఛార్జ్​షీట్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.

ఇదీ చూడండి: Lucky stone: జ్యోతిష్కుడి మ్యాజిక్కు.. దొంగలే కాదు పోలీసులూ అవాక్కు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.