హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్లో ట్రెడా ప్రాపర్టీ షో (Treda Property Show) ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా సినీహీరో నాగశౌర్య హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికోసం ఆనువైన స్థలాలను ఆకర్షణీయమైన ఆఫర్లతో పూర్తి సమాచారం అందుబాటులో ఉంచామని ట్రెడా అధ్యక్షులు చలపతిరావు తెలిపారు. ఇళ్ల స్థలాలు, డ్యూప్లెక్స్ ఇళ్లు, ప్లాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచామని తెలిపారు.
మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రాపర్టీల ప్రదర్శనలో వందకుపైగా బిల్డర్లు, రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు, బ్యాంకింగ్ ప్రతినిథులు పాల్గొననున్నారు. కొవిడ్ నేపథ్యంలో గతేడాది ప్రాపర్టీ షో నిర్వహణ జరగలేదని చలపతిరావు పేర్కొన్నారు. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ప్రతిఒక్కరికి అనువైన బడ్జెట్లో తీసుకొచ్చిన స్థలాల నుంచి కావల్సిన స్థిరాస్థిని ఎంచుకునే అవకాశాన్ని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ ప్రాపర్టీ షోలో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, ఫామ్ ల్యాండ్స్‌తో సహా పలు రకాల ప్రాపర్టీలను డెవలపర్లు అందజేస్తున్నారని ట్రెడా అధ్యక్షులు తెలిపారు. వీటికి పలు బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల నుంచి గృహరుణాలు పొందే సౌలభ్యం ఉందని పేర్కొన్నారు. జంట నగరాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మూడు రోజులు జరిగే ఈ ప్రాపర్టీ షో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణలో అతిపెద్ద ప్రాపర్టీ షో ఇదేనని చెప్పవచ్చు. ఎవరు హైదరాబాద్ వచ్చినా... తమకు ఒక ఇళ్లు ఉండాలనే ఫీలింగ్‌ను తీసుకురావడమే మా లక్ష్యం. ఇక్కడ మెుత్తం 160 స్టాళ్లు ఉన్నాయి. ఈ ప్రాపర్టీ షోలో ఇళ్ల స్థలాలు, డ్యూప్లెక్స్ ఇళ్లు, ఫ్లాట్లు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాము. జంట నగరాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేశాము. -ట్రెడా అధ్యక్షులు చలపతిరావు
ఇదీ చదవండి: MAA Elections: 'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకొన్న బండ్ల గణేశ్