ETV Bharat / state

మిద్దె సాగుపై ఆసక్తి చూపుతున్న నగరవాసులు - తెలంగాణ వార్తలు

మిద్దె సాగుపై నగరవాసులు అమితాసక్తిని చూపుతున్నారు. కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నగరాల్లో ఏ కొద్ది స్థలం దొరికినా మెుక్కల పెంపకం చేపడుతున్నారు. ఉద్యాన శాఖ రాయితీలు ఇవ్వడంతోపాటు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండటంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ... సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలు, పూలు, పండ్లు పెంచుతున్నారు.

trainings-on-terrace-gardening-in-hyderabad
మిద్దె సాగుపై ఆసక్తి చూపుతున్న నగరవాసులు
author img

By

Published : Mar 4, 2021, 2:16 PM IST

శాస్త్రీయ పద్ధతిలో మెుక్కల పెంపకంపై ఔత్సాహికులకు ఉద్యాన శాఖ శిక్షణనిస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర ఉద్యాన శిక్షణ సంస్థలో ప్రతి రెండో శనివారం, నాలుగో ఆదివారం మిద్దెతోటల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు. గృహిణులు, విశ్రాంత ఉద్యోగులు హాజరై కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. కూరగాయలు, పూలు, పండ్లు స్వయంగా పండించుకుంటూ ఆర్థికంగానూ లాభపడవచ్చని వారు చెబుతున్నారు.

అనుభవాలు పంచుకుంటున్నారు..

ఇక్కడ నేర్చుకున్న అంశాలను ఇంటి వద్ద ఆచరిస్తూ.. సేంద్రీయ పద్ధతిలో మెుక్కలు పెంచుతామని శిక్షణకు హాజరైన వారు చెబుతున్నారు. రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారాన్ని పండించడమే కాకుండా... ఆహ్లదం, ఆర్థికంగానూ తోడ్పడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ అనుభవాలు ఔత్సాహికులతో పంచుకుంటూ... వర్మి కంపోస్టు తయారీ, తోటల నిర్వహణ, సాంకేతిక అంశాలు చర్చించుకుంటున్నారు.

మెళకువలు నేర్చుకుంటున్నారు..

కరోనా కారణంగా రోగ నిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారం పట్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇప్పటికే చాలా మంది నగరవాసులు మిద్దెతోటలు మొదలు పెట్టారు. వీటి సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలో శిక్షణలో వివరిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడిస్తున్నారు.

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నగర సేద్యంపై శిక్షణ శిబిరాలు నిర్వహించి... ఇప్పటి వరకు 20 వేల మందికిపైగా అవగాహన కల్పించారు.

ఇదీ చూడండి: బరువు పెరుగుతామేమోనని ఈ పదార్థాలను దూరం పెట్టకండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.