ETV Bharat / state

Drone: గ్రామీణ యువత, రైతులకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ - Drone training for farmers

త్వరలోనే గ్రామీణ యువత, రైతులు డ్రోన్ల (Drone) వినియోగంలో శిక్షణ పొందనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ, మారుత్‌ డ్రోన్‌ టెక్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదరడం ద్వారా ఇది సాధ్యంకానుంది.

training
డ్రోన్
author img

By

Published : Jun 25, 2021, 6:48 PM IST

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ, మారుత్‌ డ్రోన్‌ (Drone) టెక్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ పరస్పర ఒప్పందం ద్వారా గ్రామీణ యువత, రైతులకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇవ్వడానికి అవకాశం కలుగనుంది. ఇప్పటికే డ్రోన్ల (Drone)ను ప్రయోగాత్మకంగా వినియోగించేందుకు విశ్వవిద్యాలయానికి డీజీసీఏ అనుమతి ఇచ్చింది.

నాణ్యతా ప్రమాణాలతో కూడిన శిక్షణ విధానాలు రూపొందించుకోవాల్సిందిగా యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు సూచించారు. డ్రోన్ (Drone) టెక్నాలజీ వినియోగంలో కనీస పరిజ్ఞానం లభించేలా శిక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు. గ్రామీణ వ్యవసాయదారులు సత్వరం అందిపుచ్చుకొనేలా శిక్షణ ఉండాలని అన్నారు.

త్వరలోనే సర్టిఫికేషన్ కోర్సు ప్రారంభించాలని ఒప్పందం కుదిరిన సందర్భంగా సమావేశం అభిప్రాయపడింది. అందుకోసం విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌- ఎస్‌డీసీ ఏర్పాటు చేయనున్నట్ల వర్సిటీ ప్రకటించింది. వర్సిటీ ఉపకులపతి ప్రవీణ్‌రావు సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలపై రిజిస్ట్రార్, హేమంత్ దండపాణి, ప్రేమ్‌కుమార్‌ ఇస్లావత్ సంతకాలు చేశారు. పరస్పరం అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

ఇదీ చదవండి: Corona Third Wave: కరోనాపై పోరుకు అధునాతన కమాండ్​ కంట్రోల్​ కేంద్రం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.