ETV Bharat / state

Traffic Pending Challans: ముగిసిన పెండింగ్​​ చలానాల ఆఫర్.. ఈసారి..! - Pending Challans offer

Traffic Pending Challans: వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ల రాయితీ గడువు ముగిసింది. శుక్రవారంతో ఈ ఆఫర్​ ముగిసినట్లు పోలీస్​ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రూ.302 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది.

ముగిసిన పెండింగ్​​ చలానాల ఆఫర్.. ఈసారి..!

author img

By

Published : Apr 16, 2022, 4:58 AM IST

Traffic Pending Challans: రాష్ట్రంలో రాయితీతో పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపు గడువు శుక్రవారంతో ముగిసింది. నిన్న రాత్రి 10 గంటల వరకు వాహనదారులు 3 కోట్ల చలాన్లు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.302 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. చలాన్లు చెల్లించేందుకు ప్రజల మీద భారం పడకుండా.. హోంమంత్రి ఈ నిర్ణయం తీసుకోగా.. మార్చి 31తో గడువు ముగిసింది. అయితే.. వాహనదారుల స్పందన, విజ్ఞప్తుల మేరకు ఈ నెల 15 వరకు ఈ అవకాశాన్ని పొడిగించారు.

మార్చి 31 వరకు 1.70 చలాన్లకు సంబంధించి రూ.250 కోట్లు వసూలు అయ్యాయి. పొడిగించిన గడువుతో గడిచిన 15 రోజుల్లో మరో రూ.50 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈసారి గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 65 శాతం మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు ట్రాఫిక్ పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి.

ఇవీ చూడండి..

sound pollution in City: ఇష్టారీతిగా హారన్‌ మోగిస్తే.. చలానా పడుద్ది జాగ్రత్త..!

సర్పంచ్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.