ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని స్తిరాస్థి వ్యాపారులు... హయత్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. వీరికి భాజపా, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పాల్గొన్నారు. అనంతరం విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు.
భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో... ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి... హయత్నగర్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప వివాదం ఏర్పడింది.
ఇదీ చూడండి: సందిగ్ధంలో సర్కారు: ఎల్‌ఆర్‌ఎస్‌పై ఏం చేద్దాం.. ఎలా ముందుకెళదాం?