హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్న వ్యాపారస్తులు తమ లైసెన్స్‌లను ఈ నెలాఖరులోగా రెన్యువల్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ట్రేడ్‌లైసెన్స్‌ల రెన్యువల్‌లో జాప్యం చేస్తే... ఫీజుకు అదనంగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
నిర్ణీత కాలం తర్వాత జులై 1 నుంచి ఆగస్టు 30 వరకు ట్రేడ్ లైసెన్స్‌ల రెన్యువల్‌కు వచ్చే దరఖాస్తులపై అదనంగా 25 శాతం అపరాధ రుసుంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆగస్టు 31 నుంచి అన్ని దరఖాస్తులపై అదనంగా 50శాతం అపరాధ రుసుంగా వసూలు చేయనున్నట్లు వివరించారు.
గతంలో ట్రేడ్ లైసెన్స్ లేనివారు ట్రేడ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో, మీ-సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల‌్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:ఇరాక్: అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్ దాడులు!