ETV Bharat / state

mp revanth reddy on trs: 'నేను నిన్నే చెప్పానుకదా.. అదే జరుగుతుందని' - పార్లమెంటులో ఎంపీల తీరుపై రేవంత్​ రెడ్డి విమర్శలు

mp revanth reddy on trs: ధాన్యం కొనుగోళ్ల అంశం మరింత క్లిష్టంగా మారుతున్నా తెరాస ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించడం వెనుక ఆంతర్యమేంటని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. భాజపా-తెరాస లోపాయకారి అవగాహనలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. తెరాస ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాల నుంచి పారిపోతారని నిన్న తాను చెప్పినట్లుగానే జరిగిందని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Dec 7, 2021, 7:47 PM IST

mp revanth reddy on trs: పార్లమెంటు సమావేశాల నుంచి తెరాస ఎంపీల వాకౌట్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మోదీ, కేసీఆర్ మధ్య ఒప్పందం ప్రకారమే తెరాస ఎంపీలు వాకౌట్‌ చేశారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రెండు నెలలుగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారని.. ధాన్యం కుప్పల వద్దే ప్రాణాలు వదులుతున్నారని పేర్కొన్నారు. దిల్లీ పర్యటనలో ఏంచేశారో కేసీఆర్ ఇప్పటివరకు చెప్పలేదని... ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకే తెరాస ఎంపీల నిరసన చేపట్టారని ఆరోపించారు.

'రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నాను.. ఇవాళ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న వరి సమస్య తీరిందా..? పోని యాసంగిలో కేంద్ర ప్రభుత్వం ఎంత కొనుగోలు చేస్తుందో మీరు అడిగినదానికి సభావేదికగా మీకు ఏమైనా వివరణ ఇచ్చారా..? తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు.. యాసంగిలో కేంద్ర కొనుగోలు చేసే వరి గురించి ఏమాత్రం స్పష్టత ఇవ్వలేదు. సమస్య మరింత జటిలం అయిపోయింది. రైతులు ఇంకా ఆందోళనకు లోనవుతున్నారు. రోజుకు పలువురు రైతులు మృతి చెందుతున్నారు. ఇంత దుఃఖ పరిస్థితులను తెలంగాణ రైతులు ఎదుర్కొంటూ ఉంటే... రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు.. శీతాకాల పార్లమెంట్​ సమావేశాలను ఎందుకు బహిష్కరించి దిల్లీ నుంచి కాదని.. గల్లీకి వెళ్లారు. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు.. గల్లీలో మీరు మాటిచ్చారు. శీతాకాల సమావేశాల్లో దిల్లీ మీద యుద్ధం ప్రకటిస్తాము.. నరేంద్ర మోదీ మెడలు వంచుతామని మీరు బయలుదేరి వచ్చారు. కేసీఆర్​ దేనికీ భయపడడు.. మోదీతో కొట్లాడతా అన్నాడు. శీతాకాల సమావేశాలు 23వ తారీకు వరకు జరుగుతున్నా.. సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించడం ద్వారా ప్రభుత్వం బిజినెస్​ నడపడానికి సహకరించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.' -రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

'సమస్య పరిష్కారం కాకుండా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..?'

ఇదీ చూడండి: TRS MPs boycott Parliament: 'పార్లమెంట్‌ సమావేశాలు బాయ్‌కాట్ చేస్తున్నాం.. రాజీనామా అంశాన్ని ఆలోచిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.