ETV Bharat / state

హుజూర్​నగర్​లో ఓటమికి బాధ్యుడిని నేనే: ఉత్తమ్​

author img

By

Published : Oct 29, 2019, 11:09 PM IST

Updated : Oct 29, 2019, 11:38 PM IST

సొంత నియోజకవర్గం హుజూర్​నగర్‌లో ఓటమిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి స్పందించారు. ఓటమికి బాధ్యత పూర్తిగా తనదేనని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్​ ప్రకటించారు.

హుజూర్​నగర్​లో ఓటమికి బాధ్యుడిని నేనే: ఉత్తమ్​

హుజూర్​నగర్​లో ఓటమికి తానే బాధ్యుడినని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి కాంగ్రెస్​ కోర్​ కమిటీ సమావేశంలో ప్రకటించారు. గాంధీభవన్‌లో ఇవాళ మధ్యాహ్నం జరిగిన సమావేశంలో హుజూర్‌నగర్‌ ఓటమి, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతోపాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి. హుజూర్​నగర్​ ఉపఎన్నికలో తెరాస పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా... డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసిందని నేతలు వివరించారు. పార్టీపరంగా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి విజయం కోసం కృషి చేశారని ఉత్తమ్​ పేర్కొన్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల విషయమై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పీసీసీ అధ్యక్షుడు నాయకులకు సూచించారు. అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు, ఇన్​ఛార్జీలు లేని నియోజకవర్గాలకు వెంటనే ఇన్​ఛార్జీలను నియమించి... మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల ఎంపిక వ్యవహారం చూసుకోవాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌కు బాధ్యతలు అప్పగించారు.

హనుమంతరావు ఆగ్రహం...

పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు పీసీసీ అధ్యక్షుడుకి తెలియకుండా...కొందరు నాయకులు ఎవరికి తోచినట్లు వారు ఎలా చేపడతారని సీనియర్​ నేత వి.హనుమంతురావు... రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి ఆర్సీ కుంతియాను నిలదీశారు. బయట పార్టీల నుంచి వచ్చిన కొందరు పార్టీకి నష్టం కలిగించేటట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొదటి నుంచి పార్టీలోనే ఉన్న తాను చివరి వరకూ పార్టీని వీడనని స్పష్టం చేసినట్లు సమాచారం. తమను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని వీహెచ్​ హెచ్చరించారు. పార్టీ సమావేశాలకే పరిమితం కాకుండా..పార్టీలో ఏమి జరుగుతుందో తెలుసుకొని అంతర్గతంగా ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కుంతియాను కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చిందని...ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో రాకుండా చూసుకుంటామని వివరణ ఇవ్వడం వల్ల హనుమంతురావు సంతృప్తి చెందారని తెలుస్తోంది.

ఇదీ చూడండి: ప్రారంభమైన పీసీసీ కోర్ కమిటీ సమావేశం

TG_HYD_59_29_PCC_ACCEPT_RESPONSIBLE_HUZURNAGAR_DEFEAT_AV_3038066 Reporter: Tirupal Reddy గమనిక: 3జి ద్వారా ఫీడ్‌ వచ్చింది. వాడుకోగలరు. ()హుజూర్‌ నగర్‌ ఓటమికి తనదే బాధ్యత అని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో ప్రకటించారు. గాంధీభవన్‌లో ఈ మధ్యాహ్నం జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో హుజూర్‌నగర్‌ ఓటమితోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీకి నష్టం కలిగించే కార్యకలాపాలు చేపట్టడం లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. అధికార పార్టీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడడంతోపాటు డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేయడంతోనే కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైనట్లు వివరించారు. పార్టీపరంగా ఏలాంటి వైఫల్యం లేకుండా అందరూ కృషి చేశారని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కొంతసేపు చర్చించారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నాయకులకు సూచించారు. అదేవిధంగా జిల్లా కన్వీనర్లు, ఇంఛార్జిలు లేని నియోజక వర్గాలకు వెంటనే ఇంఛార్జిల నియమించి మున్సిపాలిటీల ఎన్నికల్లో నిలబడేందుకు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం చూసుకోవాలని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ను బాధ్యతలు అప్పగించారు. పార్టీ కార్యక్రమాలకు చెంది పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి తెలియకుండానే...కొందరు నాయకులు ఎవరికి తోచినట్లు వారు ఏలా చేపడతారని మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతురావు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియాను నిలదీశారు. బయట పార్టీల నుంచి వచ్చిన కొందరు పార్టీకి నష్టం కలిగించేట్లు వ్యవహరిస్తున్నారని, మొదటి నుంచి పార్టీలోనే ఉన్నామన్న వీహెచ్‌ చచ్చే వరకు పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారని తెలిసింది. తమను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించిన హనుమంతురావు పార్టీ సమావేశాలకే పరిమితం కాకుండా..పార్టీలో ఏమి జరుగుతుందో తెలుసుకుని అంతర్గతంగా ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కుంతియాను కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చిందని...ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో రాకుండా చూసుకుంటామని వివరణ ఇవ్వడంతో హనుమంతురావు సంతృప్తి చెందారని తెలుస్తోంది.
Last Updated : Oct 29, 2019, 11:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.