ఉత్తర్‌ప్రదేశ్ లఖింపూర్(Lakhimpur Incident)లో రైతుల మరణాలను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr).. ఎందుకు మాట్లాడటం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Tpcc President Revanth Reddy) ప్రశ్నించారు. కేసీఆర్, భాజపా ఒక్కటేనని, రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతోన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతోన్న శాసనసభ సమావేశాల్లో దానితో పాటు లఖింపూర్ రైతుల మరణాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభ ఎందుకు తీర్మానం చేయలేదని ఆయన ప్రశ్నించారు.
కొవ్వొత్తుల ర్యాలీ...
లఖింపూర్ ఘటన(Likimpur Incident)కు నిరసనగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గాంధీ స్ఫూర్తితో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై భాజపా ఎంపీ అమానుషంగా ప్రవర్తించారని.. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. భాజపా ఎంపీ కుమారుడు రైతులను కారుతో తొక్కించాడన్న రేవంత్... రాష్ట్ర పార్టీ కమిటీ త్వరలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారి కుటుంబాలను కలుస్తుందని తెలిపారు.
మంత్రి పదవి తొలగించాలి..
రైతుల కుటుంబాలను కలిసేందుకు ప్రయత్నించిన ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)పైనా అక్కడి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించిందన్నారు. ఘటనకు కారణమైన మంత్రిపై చర్యలు తీసుకోవటంలో యోగీ, మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి... రాష్ట్రపతి పాలనను విధించాలని, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని కోరారు. అజయ్ మిశ్రా(Central Minister Ajay Mishra)ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో రైతులు న్యాయంగా, శాంతియుతంగా మహాత్మగాంధీ స్ఫూర్తితో రోడ్డు మీద ధర్నా చేస్తుంటే అజయ్ మిశ్ర అనే కేంద్ర సహాయమంత్రి కొడుకు దుర్మార్గంగా రైతులపైకి తన వాహనాలతో ఎక్కించి నలుగురు రైతుల మరణాలకు కారణమైండు. రాష్ట్రంలో శాసనసభ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్న అని చెప్తడు. అసెంబ్లీలో రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నమని చెప్పి ఎందుకు తీర్మానం చేయలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దుర్మార్గాన్ని శాసనసభలో ఎందుకు ఖండించలేదు. అంటే ఇక్కడ కేసీఆర్... అక్కడ మోదీ ఇద్దరు వేరువేరు కాదు ఒక్కటే. ఇద్దరు రైతు వ్యతిరేకులు. ఇవాళ కేసీఆర్ మోదీ వైపు ఉన్నడు. మోదీ... అంబానీ, అదానీ వైపు ఉన్నడు.
-- రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
ఇదీచూడండి : Kcr On Trs Party: 'మాది రాజకీయ పార్టీ.. మఠం కాదు... ముందుండేది కూడా మేమే'