హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election)ను దేశంలోనే ఖరీదైందిగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Tpcc Chief Revanth Reddy) అన్నారు. పంపకాల్లో తేడాతోనే హరీశ్, ఈటల మధ్య మాటలయుద్ధం జరుగుతోందన్నారు. నిరుద్యోగ యువతి నిరోషాపై తెరాస నేతలు దాడులు చేశారని రేవంత్ ఆరోపించారు. నిరుద్యోగ భృతి గురించి ప్రశ్నించినందుకే నిరోషాపై దాడి చేశారని మండిపడ్డారు. పీఎస్‌కు వెళ్లినా నిరోషాకు న్యాయం జరగలేదన్న రేవంత్... ప్రశ్నించే వారిపై జరుగుతున్న దాడిని కాంగ్రెస్ ఖండిస్తుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బల్మూరి వెంకట్(Balmuri Venkat)పైనా దాడి చేశారని పేర్కొన్నారు. దాడికి గురైనందుకే వెంకట్‌ను హుజూరాబాద్ బరిలో దింపినట్లు రేవంత్‌రెడ్డి వివరించారు. హుజూరాబాద్ ఎన్నికకు హరీశ్‌రావు కోట్లు ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు. హరీశ్‌రావు(Harish Rao)పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పకొచ్చారు. వ్యూహం ప్రకారమే తెరాస, భాజపా దళితబంధును ఆపాయన్నారు. బీసీల మీదకు ఎస్సీలను కేసీఆర్ రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. చెల్లినే గెలిపించుకోలేని కేటీఆర్ తన గురించి మాట్లాడటమేంటన్నారు. నవంబర్ 15 లోపు కేటీఆర్.. బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా హుజూరాబాద్ ఎన్నికలను మార్చిండ్రు. ఒక పార్టీ 400 నుంచి 500 కోట్ల రూపాయులు ఖర్చు పెడుతుంటే.. ఇంకో పార్టీ 100 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి హుజూరాబాద్‌లో నెలకొన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో 25 వేల మంది విద్యార్థులున్నారు. దాదాపుగా 35వేల మంది నిరుద్యోగ యువతీయువకులున్నరు. వీళ్లంతా కలిసి నిలదీయడం మొదలు పెడితే ఎన్నికల ప్రచారం అసాధ్యమవుతుందని చెప్పి అల్లుడు హరీశ్... పోలీసు మూకలను ఉసిగొల్పి నిరుద్యోగ యువతపై దాడులు చేయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పపడ్డడు. బీఫార్మసీ చదువుకున్న నిరోషాపై పోలీసులు, తెరాస నాయకులు దాడి చేసి, అసభ్యకర పదజాలంతో తిట్టారు. ఈ దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. అక్కడున్న కొంతమంది పోలీసులు తెరాస ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నరు. వందల కోట్లు ఖర్చు పెడుతూ... దాడులు చేయిస్తున్న హరీశ్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
--- రేవంత్ రెడ్డి, టీపీపీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: Revanth reddy comments: అధికారం కోసం కుల, మతాలను రెచ్చగొడుతున్నారు