సీఎం సమీక్ష
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చర్చిస్తున్న అంశాలేంటంటే?
'పరిహారం అందలేదు'
రామగుండం సింగరేణి ఉపరితల గనిలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన నలుగురి మృతదేహాలకు ఇంకా శవపరీక్ష పూర్తి కాలేదు. వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారంపై సింగరేణి యాజమాన్యంతో కార్మికసంఘాల నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కారణమేంటి?
గాలుల బీభత్సం
మహారాష్ట్రలోని నిసర్గ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తోన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. నిరాశ్రయిల కోసం శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇంకేం చేశారంటే?
భారత్-చైనా రెడీ
వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనా అరుదైన రీతిలో ఉన్నతాధికారుల భేటీకి సిద్ధమయ్యాయి. మునుపు ఎన్నడూ లేనివిధంగా లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు శనివారం భేటీ కానున్నారు. పరిష్కారం అయ్యే అవకాశం ఉందా?
'ప్రస్తుతం ఏమీ చెప్పలేం'
ఇండియా పేరును భారత్‌గా మార్చాలని ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సంబంధిత మంత్రిత్వ శాఖలు రిప్రజంటేషన్‌గా పరిగణించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇంకేమన్నదంటే?
అవే మరణాలకు కారణం!
జార్జి ఫ్లాయిడ్.. మినియాపొలిస్ పోలీస్ అధికారి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసిన ఘటనలో ఆఫ్రికన్ అమెరికన్ బలయ్యాడు. ఇలా చేయడం ఒకటో, రెండో దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అరెస్టు, విచారణల సందర్భంగా పోలీసులు వేర్వేరు టెక్నిక్లను ఉపయోగిస్తుంటారు. ఎందుకు ఇలా చేస్తారు?
భారత్‌లో నాసా వెంటిలేటర్లు
నాసాకు చెందిన జేపీఎల్ సంస్థ డిజైన్ చేసిన వెంటిలేటర్ల తయారీలో 3 భారతీయ కంపెనీలకు భాగస్వామ్యం దక్కింది. ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, భారత్ ఫోర్జ్, మేధా సర్వో డ్రైవ్స్... త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. మరిన్ని వివరాలు
నిఫ్టీ@10,000
వరుసగా ఆరో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 284 పాయింట్లు బలపడగా... నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 10 వేల మార్క్‌ను అందుకుంది. ఎందుకు పుంజుకుందంటే?
వివాదంపై యువ బాక్సర్ స్పందన
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీనా.. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌తో జరిగిన వివాదంపై స్పందించింది. దీనితో పాటే తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను 'ఈటీవీ-భారత్' ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
మీరు చూసినంత సింపుల్ కాదు..
ఇటీవలే 'బేతాళ్' వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన నటి ఆహనా కుమ్రా.. షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లు, అనుభవాలను పంచుకుంది. ప్రోస్థటిక్స్ను భరిస్తూ 45రోజుల పాటు పనిచేయాల్సి వచ్చిందని వెల్లడించింది. మీరు చూసినంత సింపుల్ కాదంటూ... ఫోటోను షేర్ చేసింది. ఇంతకీ ఆ సంగతేంటి?