ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @7PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 7pm
టాప్​టెన్​ న్యూస్​@7PM
author img

By

Published : Feb 8, 2021, 6:58 PM IST

1. చర్చలకు సిద్ధం

దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న సిక్కు రైతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు ప్రధాని మోదీ. సిక్కులను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. రాజ్యసభలో మాట్లాడిన మోదీ.. కనీస మద్దతు ధర, మండీ వ్యవస్థ ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. సభాముఖంగా రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2. ప్రాణాలు కాపాడిన ఫోన్​ కాల్​

ఉత్తరాఖండ్​ వరదల్లో చిక్కుకుని ప్రాణాలపై ఆశలు వదులుకున్న 12మంది కార్మికులకు మొబైల్​ ఫోన్ సిగ్నల్​ ఆశా కిరణమైంది. ఒక్క ఫోన్​ కాల్​.. సొరంగంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటపడేసింది. దాదాపు 7 గంటల పాటు శ్రమించి ఐటీబీపీ టీం వీరిని రక్షించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

3. కిషన్ రెడ్డి లేఖ

ఎంఎంటీఎస్ రైళ్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ సీఎం కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

4. రికార్డు ధర

జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​లో పసుపు పంటకు రికార్డు ధర వచ్చింది. మహదేవ్​ అనే రైతు పంటను... పుల్లూరి నవీన్​ ట్రేడర్స్ రూ.7111కు క్వింటాల్​ చొప్పున కొనుగోలు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5. భాజపాతోనే అభివృద్ధి

రాష్ట్రంలోని నిరుపేదల అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లేఅవుట్​లో ప్రభుత్వం కేటాయించిన.. బీసీల ఆత్మగౌరవ భవనాల స్థలాలను పరిశీలించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

6. తొలి డోసు

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్​ తొలిడోసు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తీసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

7. మోసపోయిన సీఎం కుమార్తె​

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ సైబర్ మోసానికి గురయ్యారు. ఆన్​లైన్ సంస్థ ఓఎల్​ఎక్స్​లో ఆమె అమ్మకానికి పెట్టిన కొన్ని వస్తువులను కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బు చెల్లించకపోగా.. ఆమె ఖాతా నుంచే నగదు బదిలీ చేసుకున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8. దేశాలు గజగజ

యూకేలో మంచు తుపాను ధాటికి ప్రజా రవాణా స్తంభించింది. టీకా పంపిణీని కూడా రద్దు చేశారు. ఈ తుపాను జర్మనీపైన కూడా ఉండటం వల్ల ఆ దేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివారం భారీగా మంచు కురిసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

9. చివరి రోజు లక్ష్యం 381

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్​ఇండియా 381 పరుగుల వెనుకంజలో ఉంది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్​లో వికెట్​ కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(12), గిల్​(15) ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10. రెట్టింపు చేశారు

ఉప్పెన' కథపై తన నమ్మకాన్ని పెద మామయ్య చిరంజీవి రెట్టింపు చేశారని హీరో వైష్ణవ్​తేజ్ అన్నారు. దీనితో పాటే పలు సంగతుల్ని ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.