పోరాటం ఆగదు
చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖను రైతుసంఘాలు తప్పుబట్టాయి. సాగు చట్టాలు రద్దు చేసేవరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
బీ అలర్ట్
కొత్త రకం కరోనా వైరస్‌తో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. యూకే వచ్చిన వారి వివరాలు ఆరా తీయాలని అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
సెకండ్ వేవ్ రాకపోవచ్చు
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి... కరోనా సెకండ్ వేవ్‌పై మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్‌కు అంతగా ఆస్కారం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
దూరంగా ఉండండి
ఆన్లైన్లో రుణాలిచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తున్న మొబైల్ యాప్‌ల దారుణాలపై ఆర్బీఐ స్పందించింది. ఆర్బీఐ గుర్తింపు పొందని యాప్‌లో రుణాలు తీసుకుని ఇబ్బందుల్లో చిక్కుకోకూడదని ప్రజలకు సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఉజ్వల భవిష్యత్ ఉంది
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రైతులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. రైతుల నేపథ్యం, కుటుంబ స్థితిగతులు సహా సేంద్రియ సాగు వైపు ఎలా మళ్లారో అనుభవాలు తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఘర్షణ
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బంగాల్లో రాజకీయ దాడులు పెరిగాయి. తాజాగా అధికార తృణమూల్, భాజపా నాయకుల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
16.5 కోట్ల కరోనా టెస్టులు
భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 16.5 కోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజూ సగటున 10 లక్షల కంటే ఎక్కువ టెస్టులు చేస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
దిగొచ్చిన పసిడి
బంగారం, వెండి ధరలు వరుసగా రెండోరోజూ తగ్గాయి. 10 గ్రాముల పసిడిపై రూ.252 తగ్గింది. కిలో వెండి ధర రూ.933 క్షీణించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
టీ20 ర్యాంకింగ్స్
ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఏడో ర్యాంకులో ఉన్నాడు. మరో ఆటగాడు కేఎల్ రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మహేశ్‌కు పవన్ స్పెషల్ గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుటుంబం మహేశ్‌బాబు కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా కొన్ని బహుమతులు పంపింది. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.