ETV Bharat / state

Telangana News Today: టాప్​న్యూస్ @5PM - Today News in Telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Jul 13, 2022, 5:00 PM IST

  • మరో 3 రోజులు విద్యాసంస్థలు బంద్‌

TS SCHOOLS: రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగించింది. ఈనెల 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈనెల 18 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.

  • వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష..

రాష్ట్రంలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు.

  • అప్రమత్తంగా లేకుంటే పెను విపత్తు

ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను విపత్తు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ట్విటర్​ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు.

  • నెహ్రూ జూపార్కులోకి భారీగా వరద నీరు

Floods in Zoo Park: కుండపోతగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్​లో జనజీవనం అస్తవ్యస్థమవుతుంది. నగరంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నెహ్రూ జూపార్కులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఫలితంగా జూపార్కును అధికారులు మూసేశారు.

  • ఫ్లైట్​లో 45 గన్స్​తో భారత్​కు.. అధికారులు షాక్

విదేశాల నుంచి భారత్​కు భారీ సంఖ్యలో తుపాకులు స్మగ్లింగ్ చేసిన భార్యాభర్తల్ని దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.22లక్షలు విలువైన 45 గన్స్​ స్వాధీనం చేసుకున్నారు.

  • "మన ఊరు- మన బడి" మరో టెండర్‌ రద్దు..

"మన ఊరు- మన బడి" కార్యక్రమం కింద పిలిచిన మరో టెండరును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రీన్‌ చాక్‌ బోర్డుల కొనుగోళ్ల కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసినట్లు రాష్ట్ర సర్కారు హైకోర్టుకు తెలిపింది.

  • కొవిడ్ టీకా ప్రికాషన్​ డోస్ ఇక ఫ్రీ..

18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు వారికి.. ఉచితంగా కొవిడ్ టీకా ప్రికాషన్ డోసు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 15 నుంచి 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. అర్హులందరికీ ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఉచితంగా ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కరోనా టీకా మూడో డోసు తీసుకోవడాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపాయి.

  • లంక ప్రధాని ఆఫీస్​లోకి ఆందోళనకారులు..

Srilanka Crisis: శ్రీలంకలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. కొలంబోలోని ప్రధానమంత్రి రణిల్​ విక్రమసింఘే కార్యాలయంలోకి నిరసనకారులు ప్రవేశించారు. బుధవారం ఉదయం ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి.. ప్రధాని కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రధానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

  • వన్డేల్లో బుమ్రా మళ్లీ నంబర్​ వన్​..

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్​లో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్​ యాదవ్ అదరగొట్టారు. వన్డేల్లో బుమ్రా మరోసారి నంబర్​ వన్​ స్థానానికి చేరుకున్నాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్.. తన కెరీర్​లో అత్యుత్తమ 5వ స్థానానికి ఎగబాకాడు.

  • ప్రముఖ నటుడిపై దుండగుల కాల్పులు

ప్రముఖ కన్నడ నటుడు శివరంజన్ బొలన్నవర్‌‌పై దుండగులు కాల్పులు జరపడం.. సంచలనంగా మారింది. బైల్​హొంగళ్‌లోని ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. అయితే ఈ కాల్పుల్లో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.