ETV Bharat / state

Telangana News Today: టాప్‌న్యూస్ @1PM - Today News in Telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌న్యూస్ @1PM
టాప్‌న్యూస్ @1PM
author img

By

Published : Jul 1, 2022, 12:59 PM IST

  • 'పార్టీ ప్రతినిధి అయితే ఇష్టానుసారం మట్లాడుతారా?'

మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా నాయకురాలు నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓ పార్టీకి అధికార ప్రతినిధి అయితే మాత్రం ఇష్టానుసారం మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, జాతికి క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

  • యువతుల మధ్య లవ్​.. పెళ్లైందని తెలిసి...

ప్రేమ.. సాధారణంగా ఈ ఫీలింగ్​ ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య పుడుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు అమ్మాయిల మనసుల మధ్య చిగురించింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు యువతులు వివాహం కూడా చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో జరిగింది. విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు యువతులను చితకబాదారు. ఒక యువతిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోయారు.

  • హైకోర్టులో ఏపీ సర్కార్‌కు చుక్కెదురు..

AP High Court News : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను విక్రయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. అనంతరం తుది వ్యాజ్యాల విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.

  • రాష్ట్రంలో టెట్ ఫలితాలు విడుదల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలు రానే వచ్చాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జూన్ 12న ఈ పరీక్షను నిర్వహించారు. పేపర్‌-1కు 3,18,506 (90.62) మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్‌-2 2,51,070 (90.35) మంది రాశారు.

  • ఆ అమ్మాయి వివరాలు పంపండి.. నేను సాయం చేస్తా

సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అభిమానులు, కార్యకర్తలు, ప్రజలతో తరచూ కాంటాక్ట్‌లో ఉంటారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. సామాజిక మాధ్యమాల ద్వారా ఓవైపు మోదీ సర్కార్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకు పడుతూనే.. మరోవైపు సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి చేయూతనిస్తూ ఉంటారు. తాజాగా ఓ వార్తా వెబ్‌సైట్​ ట్వీట్ చేసిన వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్.. ఆ వీడియోలో ఉన్న బాలిక వివరాలు చెప్పాలని.. తాను ఆమెకు సాయం చేస్తానని సదరు వెబ్‌సైట్​కు ట్వీట్ చేశారు.

  • రైతుల కోసం కేసీఆర్ రూ.25వేల కోట్లు వదులుకున్నారు

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. రూ.160 కోట్ల రీజినల్ రింగ్ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట చుట్టూ ఏడు మండలాలను కలిపే ఈ రీజినల్ రింగ్ రోడ్డు జిల్లాకు మణిహారం అని మంత్రి అన్నారు. దీనివల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. జిల్లాకు పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

  • ఆ దేశ పార్లమెంట్‌ రద్దు.. నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలు

Israel Parliament: వివిధ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, దానిని విజయవంతంగా ముందుకు కొనసాగించడంలో ఇజ్రాయెల్​ దేశ ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అంతే కాకుండా ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించింది. తాజా పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్‌ అతితక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవి కోల్పోవాల్సి వచ్చింది.

  • నేటి నుంచి ఈ కొత్త మార్పులు అమలు..

ఆర్థిక అంశాలను ప్రభావితం చేసే పలు మార్పులు నేటి (జూలై1) నుంచి అమల్లోకి రానున్నాయి. ఆధార్​- పాన్​ అనుసంధానం, క్రెడిట్​ కార్డులు, క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రత్యక్ష బోర్డుల పన్ను ఇలా పలు విషయాల్లో మార్పులు రాబోతున్నాయి. వాటి గురించి ఓ సారి తెలుసుకుందాం.

  • గెలిస్తే అరుదైన ఘనత.. రీషెడ్యూల్​ టెస్టు ప్రత్యేకతలివే!

గతేడాది ఇండియా-ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​లో కరోనా కారణంగా రీషెడ్యూల్​ అయిన ఆఖరి మ్యాచ్​ ఎడ్జ్​బాస్టన్​ వేదికగా శుక్రవారమే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​. అయితే సిరీస్​లో భారత్​ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్​ కీలకంగా మారింది. అప్పటికీ ఇప్పటికీ రెండు జట్లకు కెప్టెన్లు మారారు. అప్పుడు ఆడిన చాలా మంది ఇప్పుడు ఆయా తుది జట్లలో లేరు. ఈ మ్యాచ్​కు ముందు కొన్ని ఆసక్తికర​ విషయాలు తెలుసుకోండి.

  • మీనా భర్త చనిపోవడానికి ముందు ఏం జరిగిందంటే?

Meena Husband: ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్‌ అకాల మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్వాసకోస సమస్యతో ఆయన ఇటీవలే మరణించారు. ఫలానా కారణంగానే సాగర్‌ మృతి చెందారంటూ కోలీవుడ్‌ వర్గాలు, సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందుతోంది. ఈ విషయమై మీనా స్నేహితురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కళా మాస్టర్‌ స్పందించారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.