నీటి విడుదలకు ఉత్తర్వులు
రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 5న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటి కేటాయింపులు జరిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఇంకా నెరవేరలేదు
తెరాస హామీలు ఇంకా నెరవేరలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు చేయలేదని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
వేగవంతం చేయాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్‌లో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. మున్సిపల్ శాఖ, జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఖర్చు చేసింది రూ.22.78కోట్లు మాత్రమే
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారన్న అంశంపై తప్పుడు సమాచారం అందిస్తున్నారని పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రెండున్నర సంవత్సరాల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు కేవలం 28 కోట్ల మాత్రమే వెచ్చించారని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
తలొగ్గిన ట్విట్టర్
ప్రభుత్వం పేర్కొన్న ఖాతాలను తొలగించేందుకు ఎట్టకేలకు ట్విట్టర్ అంగీకారం తెలిపింది. ఈ విషయంపై బుధవారం.. కేంద్రంతో ట్విట్టర్ ప్రతినిధులు చర్చలు జరిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఏ మాత్రం తగ్గట్లే
సాగు చట్టాలకు రైతుల మద్ధతు తగ్గుతోందని వస్తున్న వార్తల్ని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ కొట్టిపారేశారు. అంతేకాకుండా తనకు రూ.80కోట్ల ఆస్తులున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల్ని ఖండించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
హెలికాప్టర్ ఇప్పించరూ..
అది ఓ సాధారణ రైతు కుటుబం. తమకున్న కొద్దిపాటి భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇంతలో.. వారి పొలానికి వెళ్లే అన్ని దారుల్ని మూసివేయించారు అక్కడి గ్రామపెద్ద. దీనిపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసుగొచ్చిన ఆ ఇంటి మహిళ.. ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశారు. తమ సమస్య పరిష్కారానికి ఓ హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
దిగొచ్చిన పసిడి
పసిడి, వెండి ధరలు శుక్రవారం భారీగా దిగొచ్చాయి. పది గ్రాముల బంగారం ధర రూ.650కిపైగా తగ్గింది. వెండి ధర రూ.68 వేల దిగువకు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఈ విషయాలు తెలుసుకోండి!
ఐపీఎల్ వేలానికి అంతా సిద్ధమైంది. ఈ ఆక్షన్‌లో పాల్గొనే తుది ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది పాలకమండలి. కొందరు ఆటగాళ్లు అత్యధికంగా 2 కోట్ల జాబితాలో ఉండగా.. మరికొందరు అనూహ్యంగా వేలానికి ఎంపికకాలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
శంకర్ దర్శకత్వంలో చెర్రీ..
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి సినిమా దర్శకుడు ఎవరో తెలిసిపోయింది. ప్రముఖ డైరెక్టర్ శంకర్‌తో తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు చెర్రీ. దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.