ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రైతుల మహా పాదయాత్ర (Amravati Farmers' Mahapadayatra)కు నేడు కూడా విరామం ప్రకటిస్తూ… అమరావతి జేఏసీ నేతలు నిర్ణయించారు. ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాదయాత్ర (Amravati Farmers' Mahapadayatra)కు రెండో రోజూ కూడా విరామం ఏర్పడింది. శనివారం ఉదయం గుడ్లూరు నుంచి యథావిధిగా యాత్ర (Amravati Farmers' Mahapadayatra) ప్రారంభం కానుంది. పాదయాత్ర మార్గంలో వాగులు పొంగి పోర్లుతుండటంతో అడ్డంకులు ఏర్పాడ్డాయని ఐకాస తెలిపింది. మహిళలు ఇబ్బందులు పడకూడదనే పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు ఐకాస నేతలు స్పష్టం చేశారు.
న్యాయస్థానంలోనూ విజయం సాధిస్తాం...
మహాపాదయాత్ర (Amravati Farmers' Mahapadayatra)కు రోజురోజుకూ ప్రజల నుంచి స్పందన పెరుగుతోందని అమరావతి రైతులు అన్నారు. తమకు లభిస్తున్న స్పందన చూసి ప్రభుత్వం(Government) తట్టుకోలేకపోతోందని విమర్శించారు. ఇప్పటికీ మంత్రులు మూడు రాజధానులు కట్టి తీరతామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. న్యాయస్థానం(Court)లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: