గడచిన 24 రాష్ట్రంలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్‌తో మరొకరు మృతి చెందినట్లు పేర్కొంది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,94,564కి చేరింది. తాజాగా వైరస్ బారి నుంచి మరో 315 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
కరోనాతో ఒకరు మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,904కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,005 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 35,160 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.
రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
వీలైనంత త్వరగా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. ఇప్పటికే 2 కోట్ల మార్కును దాటినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో ఎక్కువమందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఒక స్థిరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల ఆఖరు నాటికి మరో కోటి డోసులు పంపిణీ చేసి మూడు కోట్ల మార్కును చేరాలని యోచిస్తోంది. ఇందుకోసం అవసరం అయితే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ టీకాలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఇదీ చూడండి: Vaccination: తెలంగాణలో రెండు కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి