టీఎన్జీవో రాష్ట్ర సంఘం 11వ అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్, మాజీ అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. తెలంగాణలో కొవిడ్ బారిన పడిన ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని కోరారు.
కరోనాతో చనిపోయిన ఉద్యోగులందరికీ 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని... కొవిడ్ బారిన పడ్డ ఉద్యోగులకు నెలరోజుల ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలన్నింటిని భర్తీ చేయాలన సూచించారు. సమస్యలన్నిటిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్