తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామంటూ... గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం వాటి అభివృద్ధికి నిధులు కేటాయించడంలో విఫలమైందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన నంగారా భేరి లంబాడీ హక్కుల పోరాట సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని భావించామని... కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ తండాల్లో పేదరికం రాజ్యమేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించి... ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోదండరాం డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : 'చదువుల్లో నాణ్యత ఆందోళనకరంగా ఉంది'