Tittoo Maddipatla Young Man: ఓ ప్రవాసాంధ్రుడు తెలుగుదేశం పార్టీ పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ఏపీలోని కడప జిల్లా రాయచోటి కి చెందిన టిట్టూ మద్దిపట్ల అనే యువకుడు యూరప్ ఖండంలోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశాడు. జర్మనీ - ఆస్ట్రియా సరిహద్దుల్లో.. 2962 మీటర్ల ఎత్తులో ఉన్న జుగ్‌స్పిట్జ్ పర్వతశిఖరంపై తెలుగుదేశం జెండాను రెపరెపలాడించాడు.
చంద్రబాబు మీద అభిమానం, తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతోనే.. మైనస్ 10 డిగ్రీల చలిలో కూడా మిత్రబృందంతో కలిసి.. పర్వతారోహణ చేసి శిఖరంపై తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసినట్లు.. టిట్టూ తెలిపాడు.
ఇవీ చదవండి: