తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను విడుదల చేయనున్నారు అధికారులు. నవంబర్ నెలకు సంబంధించిన కోటాను ఇవాళ ఉదయం 11 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రోజుకు 19 వేల టికెట్ల చొప్పున ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరో మూడు వేల ఉచిత టైంస్లాట్ టోకెన్లు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో ప్రతిరోజూ ఉదయం ఐదు గంటల నుంచి అందుబాటులో ఉంచుతున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా టికెట్లు కలిగిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతించనున్నారు.
ఇదీ చూడండి. ధరణి పోర్టల్‌పై తహసీల్దార్లకు శిక్షణ