భారీ వర్షాల కారణంగా గురువారం రాష్ట్రంలోని న్యాయస్థానాలకు హైకోర్టు సెలవు ప్రకటించింది. పన్నెండు రోజులుగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని సెలవు ప్రకటించారు. హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జ్యుడీషియల్ అకాడమీతో పాటు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు సెలవు వర్తిస్తుందని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.
ఇదీ చూడండి: వరద పరిస్థితులపై స్పందించిన రాష్ట్రపతి, ప్రధాని