రాష్ట్రంలో ప్రధానమైన మూడు దేవస్థానాలకు పాలకవర్గాలను నియమించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండటం వల్ల పాలకవర్గ నియామక జాబితా నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జాబితాలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం, యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానం ఉన్నాయి.
కాగా రాష్ట్రంలోని మరో 42 దేవాలయాలకు సంబంధించిన వంశపారంపర్యేతర పాలకవర్గాలను నియమించాలని నిర్ణయించింది. ఆ దేవాలయాల వివరాలను జిల్లాల వారీగా ఆయా ఆలయాల్లో, తహసీల్దారు, పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. నోటిఫికేషన్ వెలువడిన 20 రోజుల వ్యవధిలో ఆసక్తిగల అభ్యర్థులు ఆయా జిల్లాల దేవాదాయశాఖ సహాయ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చూడండి : ఖరీఫ్ ధాన్యం లక్ష్యాల ప్రకారం మూడో స్థానంలో తెలంగాణ