నేటితో దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు ముగిసింది. మూడో విడతలో కొత్తగా మరో 32 వేల 264 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని, వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. కొత్తవారితో కలిపి మొత్తం 73 వేల 55 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. డిగ్రీలో చేరేందుకు ఇప్పటివరకు లక్షా 55 వేల 16 మంది సీట్లు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారని వెల్లడించారు.
ఈ నెల 15న మూడో విడత సీట్లను కేటాయించి..అదేరోజు ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు అక్టోబరు 30 నుంచి నవంబరు 4 వరకు కాలేజీలకు వెళ్లి చేరాలని, లేని పక్షంలో సీటు కోల్పోతారని ఆయన పేర్కొన్నారు.