ETV Bharat / state

Things Observed by Ganesh : బైబై.. మీలో మార్పు కోరుకుంటూ వెళ్లొస్తా..! - ganesh immersion in Telangana 2023

Things Observed by Ganesh : భాద్రపద శుద్ధ చవితితో మొదలైన గణపతి నవరాత్రి ఉత్సవాలు.. ఊరువాడా ఏకమై వైభవంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో రంగుల కాంతులతో లంబోదరుడికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులు తొలి పూజలందుకొని భక్తుల కోర్కెలు తీర్చిన గణనాథుడిని.. గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. మరీ ఈ క్రమంలోనే బొజ్జ గణపయ్య ప్రియమైన భక్తులకోసం.. కొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను.

ganesh immersion in Telangana 2023
Ganesh
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 5:58 AM IST

Things Observed by Ganesh 2023: పది రోజులుగా మీ అభిమానం, భక్తి పారవశ్యం చూసి నేను ముగ్దుడయ్యాను. విఘ్నాలను (Ganesh ) తొలగించడానికి వచ్చిన నేను నా ధర్మాన్ని అనుసరించి ఈ సారి మనిషి జీవన విధానంపై దృష్టి సారించాను. నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలు, దుర్ఘటనలు, వివిధ సమస్యలు ప్రజలను సతమతం చేస్తున్నాయని స్పష్టమైంది. విఘ్నాలు దూరమవడానికి జీవన విధానంలో మార్పులు అనివార్యమని గుర్తించాను. తరతరాలుగా ధర్మం నేర్పినవి అనుసరించడంలో వెనకబడిన అంశాల్లో మార్పు కోసం కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను.

పర్యావరణం : వృక్షాలు, అడవులు, జలవనరులు సంరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. సాగు పేరుతో భూమిలోకి రసాయన ఎరువులను ఇంకిస్తున్నారు. దీంతో జలవనరులు కలుషితం అవుతున్నాయి. మరోవైపు వృక్షాల నరికివేత కారణంగా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఇవన్నీ నేటి వాతావరణ మార్పులకు కారణం. వచ్చే భారీ విపత్తుల నుంచి రక్షణ కావాలంటే.. ఇప్పటి నుంచైనా ప్రకృతిని ప్రేమించడం నేర్చుకోండి.

Ganesh 108 Prasadam Naivedyam : వినాయకుడికి 108 రకాల ప్రసాదాలు.. ఇంతకీ ఎక్కడ..?

బద్ధకం వీడండి : క్రమశిక్షణ అనేది వ్యక్తి విజయానికి దోహదం చేస్తుంది. ఉదయం నిద్రలేచి వ్యాయామం మొదలు.. రాత్రి నిద్రించేవరకు సమయానుకూలంగా పనులను నిర్వర్తించాలి. ధ్యానం, వాకింగ్​, వ్యాయామం మానసిక ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. నిద్రలేచే మొదలు తలపెట్టిన పనుల పూర్తయ్యేవరకు బద్ధకాన్ని వీడాలి.

సమయపాలన : కాలయాపన అనేది చాలా మందిలో ప్రధాన లోపంగా మారింది. విద్యార్థులు విద్యాసంవత్సరం ప్రారంభంలో కాలయాపన చేసి పరీక్షల సమయంలో సిలబస్‌ అంతా నెత్తిమీద పెట్టుకుంటున్నారు. ఫలితాలపై అంచనాకు వచ్చి ఒత్తిడిలో తనువు చాలిస్తున్నారు. క్రమపద్ధతిలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ సమస్య ఉత్పన్నం కాదు. అలాగే అధికారులు, నేతలు రహదారి నిర్మాణాల్లో చేస్తున్న జాప్యం ప్రాణాపాయంగా మారుతోంది. దీనిని నిలువరించాలి.

ఆర్థిక ప్రణాళికలు : అప్పులతో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే దుర్ఘటనలు కలచివేశాయి. అత్యాశ, విచ్చలవిడి ఖర్చులు ఆర్థిక కష్టాలకు కారణం. వచ్చే ఆదాయాన్ని సమర్థవంతంగా ఖర్చు చేసే పరిజ్ఞానం పెంచుకోవాలి. అవసరమేదనే గ్రహించే విజ్ఞానం అవసరం. ముఖ్యంగా బెట్టింగ్‌లు, జూదం, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే కోరిక అప్పులు చేయడానికి ప్రేరేపిస్తోంది. చిన్నప్పటి నుంచి డబ్బు విలువ తెలియజేస్తూ, పొదుపు నేర్పించండి. అప్పు ఎలా ముప్పుగా మారుతుందో అర్థం చేయించాలి.

Devotees Rush in Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

మానవ విలువలు : తల్లిదండ్రులే సర్వమని నమ్మి ఆది పూజలందుకునే అర్హత పొందాను. ప్రస్తుత పరిస్థితులు సమాజంలో ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకరి మాట ఒకరు మాట వినకపోవడం, వృద్ధాప్యంలో నిరాదరణ, ఆస్తి కోసం హత్య చేయడం వంటివి కలచివేశాయి. ఈ విషయంలో మార్పు తప్పనిసరిగా రావాల్సి ఉంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, తోటి మనుషులతో ప్రేమతో మెలగాలి. ముఖ్యంగా మహిళలను గౌరవించడం నేర్చుకోండి.

వ్యసనాలకు దూరం : ప్రస్తుతమున్న దురలవాట్లకు తోడుగా డిజిటల్‌ వ్యసనం వచ్చి చేరింది. ఒక్క క్షణం గ్యాడ్జెట్లు కనిపించకపోతే ఉండలేకపోతున్నారు. అంతలా బానిసలయ్యారు. నెమ్మదిగా తెర సమయం తగ్గించుకోవడానికి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. పక్కనే ఉన్నా మనుషులతో.. సంబంధం లేకుండా పోయిన తరుణంలో కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం అవుతున్నాయని గ్రహించండి.

Ganesh Museum With 800 Idols : ఆ ఇంట్లో 800 వినాయక విగ్రహాలు.. 10ఏళ్లుగా సేకరణ.. ఎక్కడంటే?

వ్యక్తిగత, పరిసరాల శుభ్రత : ఈ సారి చాలా మంది దగ్గు, జ్వరం, జలుబు వంటి అనారోగ్యంతో కనిపించారు. ఎవరో వస్తారని వేచి చూడకుండా పరిసరాల్లో, ఇంట్లో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలి. వ్యక్తిగతంగానూ శుభ్రత పాటిస్తే ప్రయోజనం. అనారోగ్యానికి గురైతే పనిదినాలు కోల్పోవడం.. మరోవైపు చికిత్స ఖర్చులతో ఆర్థికం భారం పడుతుందని గ్రహించండి.

నైతిక విలువలు : వ్యాపారం, ఉద్యోగం, కుటుంబంలో నైతికత అత్యావశ్యకం. నమ్మకానికి తిలోదకాలిచ్చి పరస్పరం మోసం చేసుకునే తీరు బాధాకరం. తినే ఆహారంలో కల్తీ.. వివాహేతర సంబంధాలు, లంచావతారులు వంటివి సామాజిక విలువలను దిగజారుస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకోవాలి.

వారసత్వం : ఆచార, సంప్రదాయాల వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో కృషి చేయాలి. అది వ్యక్తిగత, కుటుంబ, సామాజిక అనుబంధాలు కావొచ్చు. ఇతర అంశాల్లో వారసత్వాన్ని సంరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

Kailash Cave Ellora Replica : కెనడాలో 'కైలాసం'.. గణేశ్ మండపానికి ఫారెనర్స్​ క్యూ!

Ganesh Immersion in Hayathnagar : నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య ఘనంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.