మాదాపూర్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు ల్యాప్టాప్లు, 18 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. హాస్టళ్లు, యువకుల గదులే లక్ష్యంగా చోరీలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
మరోవైపు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మరో దుండగున్ని అరెస్ట్ చేశారు. 17 ల్యాప్టాప్లు, 25 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని 14 ఠాణాల్లో 32 కేసులు ఉన్నాయని తెలిపారు.