ఆరు నూరైనా కొత్త సచివాలయం,అసెంబ్లీ భవనాలను నిర్మించి తీరతామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు పబ్లిసిటీ కోసమే ఆరాటపడుతున్నారన్న మంత్రి...పిక్నిక్ కోసం వచ్చినట్లు సచివాలయం వచ్చి వెళ్లారని ఎద్దేవా చేశారు.
సచివాలయ భవన నిర్మాణాలకు అడ్డుపడుతామంటోన్న కాంగ్రెస్ నేతలు చాలా వాటికి అడ్డుపడి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రజలు గర్వపడేలా కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మిస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు జనం మధ్యలోకి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం చేస్తోన్న పనులను తెలుసుకోవాలని మంత్రి సూచించారు. భట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తే సొంతపార్టీ నేతలే వెళ్ళలేదని...ఎస్సీ నేత ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదన్నారు.
ఇవీ చూడండి : మళ్లీ నేను పుట్టాలని.. దయచేసి కోరుకోకమ్మా!