ETV Bharat / state

సరిహద్దుల్లో కరోనా పరీక్షలు తప్పని సరి: డీజీపీ గౌతమ్ సవాంగ్

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్​ వచ్చే వారికి కరోనా నిర్ధరణ పరీక్షలు తప్పనిసరని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే... స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని ఏపీ వెళ్లేందుకు ప్రజలు అనుమతి పొందాలని దాచేపల్లి పోలీసులు సూచించారు.

thermal-screening-tests-are-done-at-checkposts-for-those-who-come-from-other-states-says-guntur-police
సరిహద్దుల్లో కరోనా పరీక్షలు తప్పని సరి: డీజీపీ గౌతమ్ సవాంగ్
author img

By

Published : Jul 1, 2020, 2:32 PM IST

పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్​కు వెళ్లే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని... గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా చేపడుతున్నామని తెలిపారు.

స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని ఏపీ వచ్చేందుకు... ప్రజలు అనుమతి పొందాలని దాచేపల్లి పోలీసులు సూచించారు. అనుమతి పత్రం ఉన్న వారిని... ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు తప్ప ఇతర వాహనాలను అనుతించమని తెలిపారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: క్లాస్​కు వెళ్లకుండానే ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.