TS Weather Forecast : రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రం వైపునకు ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల వరకూ పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత కొంతమేర తగ్గింది. ఇన్నాళ్లు చలిపులి పంజా విసరగా.. నేడు.. రేపు వరుణుడు పలకరించబోతున్నాడు.
ఇదీ చదవండి: NRIs Help to Villages : పల్లె ప్రగతికి ప్రవాస హారతి.. స్వగ్రామాలకు ఎన్‌ఆర్‌ఐల సొబగులు