మనిషి మేధస్సును పరీక్షించే అంశాలతో శేరిలింగంపల్లి జోన్‌లోని మయూరినగర్‌లో మల్టీ జనరేషన్ ఉద్యానాన్ని అభివృద్ధి చేస్తున్నామని అదనపు కమిషనర్ వి.కృష్ణ ‘ఈనాడు- ఈటీవీ భారత్’కు తెలిపారు.
మరిన్ని వైవిధ్యమైన ఉద్యానాలు..
సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్ జోన్‌లతోపాటు శేరిలింగంపల్లి జోన్‌లోని యూసుఫ్‌గూడ కల్యాణ్‌నగర్‌లో ఇలాంటి ఉద్యానాలు రూపుదిద్దుకుంటున్నాయి. అడ్డంకుల్లేని కాలిబాటను డిజైన్ చేశామని ఆర్కిటెక్ట్ సౌజన్య కొత్తవార్ తెలిపారు. ఇలాంటి పలు ప్రత్యేకతలతో నగరం నలువైపులా రెండు నుంచి మూడు ఎకరాల విస్తీర్ణంలో రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వ్యయంతో పలు ఉద్యానాలు నిర్మాణమవుతున్నట్లు జీహెచ్‌ఎంసీ చెబుతోంది.
థీమ్ పార్కుల్లో ఏముంటాయంటే..?
- వాసన, రుచి, స్పర్శ, ఇతర పద్ధతుల్లో జ్ఞాపకశక్తిని గుర్తించే ఆటలు
- మెదడుకు పనిచేప్పే బోర్డ్ గేమ్స్, బొమ్మల తయారీ, క్రాస్‌వర్డ్ పజిల్స్, పుస్తక పఠనం, ఛలోక్తుల పుస్తకాలు, బొమ్మల అమరిక వంటి ఆటలు
- శరీరానికి పనిచెప్పే యోగా, బంతులాట, రింగ్ టాస్, నడక, మొక్కలు నాటడం, ఇతరత్రా కార్యక్రమాలు
ఇదీ చూడండి:- 'ఎల్ఏసీ' వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత క్షిపణులు