ETV Bharat / state

good governance ranks to TS: గుడ్​ గవర్నెన్స్​.. రాష్ట్రానికి రెండు కేటగిరీల్లో మొదటిస్థానం

author img

By

Published : Dec 25, 2021, 10:02 PM IST

good governance ranks:కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గుడ్​ గవర్నెన్స్ సూచీలో రాష్ట్ర ప్రభుత్వం సత్తా చాటింది. రెండు కేటగిరీల్లో అన్ని రాష్ట్రాల కన్నా మెరుగైన స్థానంలో నిలిచింది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వాలకు కేంద్రం ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది.

good governance ranks to TS
గుడ్​ గవర్నెన్స్ సూచీలో తెలంగాణ ప్రభుత్వానికి మెరుగైన ర్యాంకులు

good governance ranks: కేంద్రం విడుదల చేసిన గుడ్​ గవర్నెన్స్​ సూచీలో తెలంగాణ మిగిలిన రాష్ట్రాల కన్నా ఉత్తమ ప్రతిభ కనబరిచింది. పారిశ్రామికీకరణ, వాణిజ్యం, సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్​మెంట్ కేటగిరీల్లో మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం పది రంగాల్లో గుడ్ గవర్నెన్స్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రథమ స్థానం దక్కింది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వాలకు కేంద్రం ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది.

telangana in good governance: పారిశ్రామికీకరణ, వ్యాపార అభివృద్ధి కేటగిరీల్లో తెలంగాణ ప్రభుత్వానికి మొదటి ర్యాంకు దక్కింది. ఇందుకు ఇక్కడి పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్ ఎన్విరాన్​మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో మెరుగైన స్థానం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పనితీరు అంశాల ఆధారంగా ఈ ర్యాంకును తెలంగాణ కైవసం చేసుకుంది. ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, నిరుద్యోగ రేటు, హౌసింగ్ ఫర్ ఆల్, లింగ సమానత్వం, ఎకానమిక్ ఎంపవర్​మెంట్ ఆఫ్ వుమెన్ సూచీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచినందుకు సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కేటగిరీలో తెలంగాణ ప్రభుత్వానికి మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వాల పాలనలోని పది రంగాలకు గానూ 58 సూచీలతో అంచనా వేసి ఈ ర్యాంకులను కేటాయిస్తోంది. ఈ ఏడాదిలో గుడ్ గవర్నెన్స్ ర్యాంకులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిల్లీలో ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.