9 వైద్య కళాశాలల్లో కొలువుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. 3,897 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులకు పోస్టులు మంజూరు చేశారు. ఒక్కో కళాశాలకు 433 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్‌లో వివిధ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందరికీ సరైన వైద్యం అందుబాటులో దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
ఇవీ చూడండి..
వైద్యవిద్యలో కొత్త అధ్యాయం.. 8 వైద్య కళాశాలలకు నేడు కేసీఆర్ శ్రీకారం
మస్క్ దెబ్బకు దిగొచ్చిన యాపిల్.. ట్విట్టర్‌తో వివాదం ఇక ముగిసినట్లే!