ETV Bharat / state

Say No To TB: 2025 నాటికి క్షయను తరిమికొట్టడమే భారత్‌ లక్ష్యం

Say No To TB: క్షయ వ్యాధి ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఈ మహమ్మారిని ముందుగానే గుర్తిస్తే నివారించవచ్చు. కానీ నిర్లక్ష్యమే అనేక మంది పాలిట శాపంగా మారుతోంది. 2025 నాటికి క్షయ లేని దేశంగా నిలవాలన్న కేంద్రం పిలుపుమేరకు రాష్ట్ర సర్కారు సైతం టీబీ నియంత్రణకు కృషి చేస్తోంది.

Tuberculosis
క్షయ వ్యాధి
author img

By

Published : Mar 24, 2022, 5:06 AM IST

Say No To TB: టీబీ-ట్యూబెర్‌ క్యులోసిస్‌ లేదా క్షయ వ్యాధి. దీని బారిన పడి సరైన చికిత్స తీసుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నవారు చాలా మంది ఉంటున్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. టీబీ ఉన్న వ్యక్తుల నుంచి వచ్చే తుంపర్లను... మరొకరు ముక్కు లేదా నోటి ద్వారా పీల్చుకున్నట్లైతే క్షయ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో జుట్టు, థైరాయిడ్, క్లోమగ్రంథి మినహా ప్రతి అవయవంపై తీవ్ర ప్రభావం చూపి... మరణానికి దారి తీయటం టీబీ లక్షణం. ముందస్తుగా గుర్తిస్తే ఈ మహమ్మారి నుంచి ప్రాణాలను కాపాడుకోవటం సులభమే అంటున్నారు వైద్యులు. వేగంగా బరువు తగ్గటం, రాత్రిపూట జ్వరం రావటం, నెలల తరబడి దగ్గు తగ్గకపోవటం వంటి లక్షణాలు ఉంటే తక్షణం పరీక్షలు చేయించుకోవాలి.

ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యం

క్షయ వ్యాధి కారక సూక్ష్మజీవులను 1882 మార్చి 24న గుర్తించారు. అప్పటి నుంచి క్షయ నియంత్రణ కోసం ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మార్చి 24న ప్రపంచ క్షయ నివారణా దినోత్సవం నిర్వహిస్తున్నారు. భారత్‌లో 2025 నాటికి టీబీ లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యంగా దిశగా ప్రభుత్వాలు పటిష్ఠ వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. టీబీని ముందుగా గుర్తించి తగిన చికిత్స అందిస్తే... 6 నెలల్లో పూర్తిగా తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

33 జిల్లాల్లో టీబీ కేంద్రాలు

క్షయను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 33 జిల్లాల్లో టీబీ కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీబీ పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 2021లో భద్రాద్రి కొత్తగూడెం, నిజమాబాద్ జిల్లాల్లో దాదాపు 20 శాతం టీబీ కేసులు తగ్గించడంతో... రాష్ట్రానికి రెండు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. టీబీపై చేపట్టిన అవగాహన కార్యక్రమాలకుగాను ఒక అవార్డు వచ్చింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు జగిత్యాలలో అత్యధికంగా 1759 టీబీ కేసులు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.