ETV Bharat / state

ఆ రెండు‌ జిల్లాల్లో రికవరీ రేటు ఎక్కువే - coronavirus india

ఒకవైపు కరోనా పాజిటివ్‌ కేసులు వస్తూనే ఉన్నాయి.. మరోవైపు ఆ మహమ్మారి బారిన పడి చికిత్స పొంది కోలుకుంటున్న వారూ ఎక్కువగానే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా, మేడ్చల్‌ జిల్లాల్లో వైరస్‌ సోకిన వారిలో సగం మందికిపైగా రికవరీ కావడంతో ఇళ్లకు చేరుకుంటున్నారు.

the-recovery-rate-is-high-in-rangareddy-and-medchal-districts
ఆ రెండు‌ జిల్లాల్లో రికవరీ రేటు ఎక్కువే
author img

By

Published : May 15, 2020, 10:07 AM IST

రంగారెడ్డి, మేడ్చల్​ రెండు జిల్లాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం విశేషం. మేడ్చల్‌ జిల్లాలో జీహెచ్‌ఎంసీ మినహాయించి 12 కేసులు వచ్చాయి. వీరిలో ఒకరు చనిపోగా మిగలిన 11 మంది కోలుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఒక్క కంటెయిన్‌మెంట్‌ జోన్‌ కూడా లేదు. గతనెల 23 తర్వాత కొత్త కేసు ఒక్కటి కూడా వెలుగు చూడలేదని అధికారులు చెబుతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో జీహెచ్‌ఎంసీ మినహాయించి 42 కేసులు రాగా 33 మంది చికిత్స తీసుకుని గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మహేశ్వరం మండలంలో 70 ఏళ్ల వృద్ధుడు సైతం కోలుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు.

మృతులకు ఇతర రుగ్మతలు

కరోనా బారిన పడి చనిపోయినవారు అప్పటికే ఇతర రుగ్మతలతో బాధ పడుతున్నవారే కావడం గమనార్హం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికితోడు జ్వరంలాంటివి వస్తే స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అక్కడి వైద్యులు సరిగా వైద్యం చేయడం లేదు. నందిగామ మండలంలో చనిపోయిన మహిళ విషయంలో ఇదే జరిగింది.మేడ్చల్‌ జిల్లాలో చనిపోయిన ముగ్గురూ అప్పటికే వేరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నారు.

the-recovery-rate-is-high-in-rangareddy-and-medchal-districts
ఆ రెండు‌ జిల్లాల్లో రికవరీ రేటు ఎక్కువే

ఇవీ చూడండి: ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.