రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగరంలో దారుణం చోటుచేసుకుంది. జానెట్ జార్జి మెమోరియల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపల్ ప్రసాదరావు(47) అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో పలు మార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు రంగారెడ్డి షీటీమ్, చెల్డ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేసింది. అనంతరం అధికారులు అమ్మాయిని కలిసి కీచక ప్రిన్సిపల్ నుంచి విముక్తి కల్పించారు.
బాధితురాలి ఫిర్యాదుతో కీచక ప్రిన్సిపల్ను అబ్దుల్లాపూర్ మేట్ పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాదరావుతో పాటు తన భార్య కూడా విద్యార్థులను వేధిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్ఏ, బీఈడీ పూర్తి చేసిన ప్రసాదరావు 2006 నుంచి ఆ పాఠశాలలో పని చేస్తున్నట్లు తెలిసింది.
ఇదీ చూడండి : 'ఆర్టీసీకి అప్పుడు రాని నష్టం.. ఇప్పుడెలా వస్తుంది'