ETV Bharat / state

Tummala Rangarao ED Case: తుమ్మల రంగారావుకు ఊరట.. ఆ కేసులో విచారణ నిలిపివేత - హైకోర్టు

Tummala Rangarao ED Case: ఎమ్మార్​ కేసులో తుమ్మల రంగారావుకు ఊరట లభించింది. ఈడీ నమోదు చేసిన కేసులో తుమ్మల రంగారావుపై విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Tummala Rangarao ED Case
ఎమ్మార్​ కేసులో తుమ్మల రంగారావుకు ఊరట
author img

By

Published : Jan 22, 2022, 5:30 AM IST

Tummala Rangarao ED Case: ఎమ్మార్ వ్యవహారంలో తుమ్మల రంగారావుకు ఉపశమనం లభించింది. ఈడీ నమోదు చేసిన కేసులో తుమ్మల రంగారావుపై విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఎమ్మార్ కేసులో తనను నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ తుమ్మల రంగారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ జి.రాధారాణి విచారణ చేపట్టారు.

high court on ED case: పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీబీఐ పిటిషనర్​తోపాటు అతనికి చెందిన స్టైలిష్ హోమ్స్ రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్​ను నిందితుల జాబితాలో చేర్చిందని పేర్కొన్నారు. అయితే అప్రూవర్​గా మారడంతో అభియోగ పత్రంలో నిందితుల జాబితా నుంచి తొలగించిందన్నారు. పిటిషనర్​ను సాక్షిగా పరిగణనలోకి తీసుకుని వాంగ్మూలం నమోదు చేసుకుందని చెప్పారు. దీనికి సీబీఐ కోర్టు కూడా ఆమోదం తెలుపుతూ క్షమాపణ మంజూరు చేసిందన్నారు.

ed case: ఈడీ కేసులో కూడా తనను సాక్షిగా పరిగణనలోకి తీసుకోవడానికి అభ్యంతరం లేదని.. అయితే ఈడీ నిందితుడిగా చేర్చిందన్నారు. ఈడీ అభియోగపత్రాన్ని ఇప్పటికే విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకున్నందున తనపై కేసును కొట్టివేయాలన్నారు. కోనేరు రాజేంద్రప్రసాద్ సూచనల మేరకు విల్లా ప్లాట్లను విక్రయించినట్లు చెప్పారు. చదరపు గజం రూ .5 వేలు నిర్ణయించగా కాగితాల్లో ఆమేరకు వసూలు చేసి అనధికారికంగా చదరపు గజానికి రూ .4 నుంచి 45 వేల దాకా వసూలు చేసి ఆ మొత్తాన్ని కోనేరు రాజేంద్రప్రసాద్, సునీల్ రెడ్డిలకు అందజేసినట్లు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. ఇలా అక్రమంగా వసూలు చేసిన మొత్తం రూ. 96 కోట్ల దాకా ఉందని అభియోగ పత్రంలో పేర్కొంది. వాదనలను విన్న న్యాయమూర్తి ఈడీ కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.