ETV Bharat / state

జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు - corona in hyderabad

హైదరాబాద్​ నగరంలో కరోనా కట్టడికి జీహెచ్​ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. విదేశాల నుంచి నగరానికొచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు పూర్తి హోమ్​ క్వారంటైన్​లో ఉంచాలన్న ప్రభుత్వ ఆదేశాలతో సర్వైలైన్స్​ బృందాలు ఏర్పాటు చేసి వారిని పరిశీలించేందుకు జీహెచ్​ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.

corona protection activities in ghmc
జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు
author img

By

Published : Mar 23, 2020, 10:30 AM IST

Updated : Mar 23, 2020, 11:40 AM IST

విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్​ఎంసీ పరిధిలో ఎక్కువ సంఖ్యలో విదేశాల నుంచి ప్రయాణించి వచ్చిన వారు ఉండటంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించింది. ప్రత్యేక బృందాలతో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి... 14 రోజుల పాటు పూర్తిగా క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించింది. ఈ రోజుల్లో వారిని సర్వైలెన్స్ బృందాలు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పరిశీలించాలని స్పష్టం చేసింది.

హోమ్ క్వారంటైన్​లో ఉన్న వ్యక్తులకు స్టాంపింగ్, ఇళ్లకు స్టికర్లు వేయాలని తెలిపింది. హోమ్ క్వారంటైన్​కు సంబంధించి ఇరుగుపొరుగు వారు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. కరోనా లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని... పాజిటివ్ కేసుల సంబంధీకులు అందరినీ గుర్తించి పూర్తిస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు.

హోమ్ క్వారంటైన్‌కు సంబంధించి ఇరుగుపొరుగు, కాలనీ సంక్షేమ సంఘాలకు సమాచారం అందించాలని పేర్కొంది. పాజిటివ్‌ కేసుల సంబంధీకులను గుర్తించి పర్యవేక్షించాలని తెలిపింది. జీహెచ్​ఎంసీ పరిధిలో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌ పరిధిలోని సిబ్బంది, వైద్యాధికారులు జీహెచ్​ఎసీ కమిషనర్‌ కిందే పనిచేయాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి: ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​ మార్గదర్శకాలివే...

Last Updated : Mar 23, 2020, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.