రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల వానలు ఆశాజనంగా కురుస్తున్నాయి. సాగు నీటి ప్రాజెక్టులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లోకి నీరు వచ్చి చేరుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులు, నీటి వనరుల్లో చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది రొయ్యల సాగు సైతం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రొయ్య పిల్లల సేకరణ, పంపిణీకి సంబంధించి టెండర్ ప్రక్రియ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. టెండర్ కమిటీ ఛైర్మన్‌గా మత్స్య శాఖ కమిషనర్ వ్యవహరిస్తారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్ ఉత్తర్వలు జారీ చేశారు.