కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు ముగిశాయి. నెక్లెస్‌రోడ్‌పీవీ ఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. జైపాల్ రెడ్డి పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి అంత్యక్రియల క్రతువును నిర్వహించారు. కుటుంబసభ్యులు, పార్టీలకు అతీతంగా రాజకీయనేతలు, అభిమానులు చివరిసారిగా ఆయనకు అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఆదర్శనేత జైపాల్‌ను కడసారి చూసేందుకు పలువురు ప్రముఖులు తరలిరావడం వల్ల పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక సీఎల్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్‌రమేశ్‌కుమార్‌జైపాల్‌రెడ్డి పాడె మోశారు.
జైపాల్ రెడ్డితో అనుబంధాన్ని పలువురు నేతలు గుర్తు చేసుకుని ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఏ పార్టీలో ఉన్న అందరితో ఆత్మీయంగా ఉండేవారన్నారు. అనునిత్యం ప్రజాసంక్షేమం కోసం పరితపించేవాడని చెప్పారు. ఆదర్శవంతమైన రాజకీయానికి జైపాల్ రెడ్డి నిలువెత్తు నిదర్శనమని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఆయన కృషి మరువలేనిదని కొనియడారు.
ఇవాళ ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర మధ్యాహ్నం 12.25 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుంది. ఆయన భౌతికకాయాన్ని కొద్దిసేపు ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. అనంతరం అక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల నినాదాలతో నెక్లెస్‌రోడ్డు వరకు జైపాల్‌రెడ్డి అంతిమయాత్ర సాగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌నేతలు గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, ఆర్సీ కుంతియా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్, గీతారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, పొన్నాల, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, సీతక్క, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌నేతి విద్యాసాగర్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, తెరాస నేతలు కేకే, డి.శ్రీనివాస్, హరీశ్‌రావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, భాజపా నేతలు చింతల రామచంద్రారెడ్డి, డీకే అరుణ, తెదేపా నేత నన్నపనేని రాజకుమారితో పాటు వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.
మన్మోహన్‌సింగ్‌సంతాప సందేశం
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌జైపాల్‌రెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపారు. సంతాప సందేశాన్ని జైపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మీకి మన్మోహన్‌పంపారు.
ఇదీ చూండండి: అశ్రునయనాల మధ్య ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు