సంక్రాంతి పండుగకు సరదాగా గాలిపటాలను ఎగురవేసేందుకు ఉపయోగించే సింథటిక్ మాంజాలు మానవాళిపట్ల, పర్యావరణంపట్ల, పక్షుల పట్ల ప్రమాదకరంగా మారుతున్నాయని అటవీశాఖ పేర్కొంది. సింథటిక్ మాంజాల వాడకాన్ని నిషేధించాలని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది. అటవీశాఖ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సింథటిక్ మాంజాలను విక్రయించే దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు.
అటవీఅధికారులతో కూడిన 13 టీంలను ఏర్పాటు చేసి హైదరాబాద్లోని పలు దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇలా 182 దుకాణాల నుంచి 36.5 కేజీల సింథటిక్ మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ హితం కోసం పలు ఎన్జీవోలు అటవీ, పోలీసు శాఖలతో చేతులు కలిపాయి.
ఇదీ చదవండి: సంక్రాంతి సంబురం... కళకళలాడిన శిల్పారామం