ETV Bharat / state

Green India Challenge: 'దసరానాడు జమ్మిచెట్టు నాటేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్' - Mp santhosh kumar latest updates

దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టును ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో నెలకొల్పాలనే వినూత్న కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టనుందని ఎంపీ సంతోశ్​ కుమార్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను ఎంపీతో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఆవిష్కరించారు.

Green India Challenge
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
author img

By

Published : Sep 16, 2021, 5:11 PM IST

విశిష్టమైన చెట్లను నాటి భవిష్యత్తు తరాలకు అందిద్దామని రాజ్యసభ ఎంపీ సంతోశ్​ కుమార్ (Mp Santhosh Kumar) విజ్ఞప్తి చేశారు. రాబోయే దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టును ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో నెలకొల్పాలనే వినూత్న కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) చేపట్టనుందని ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy), ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి (KV Ramana Chary) చేతుల మీదుగా సంతోశ్​ కుమార్ ఆవిష్కరించారు.

జమ్మిచెట్ల ప్రతిష్ఠ పెంచేలా..

వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ఠ కలిగిన చెట్టుగా... భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. పలు కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతి ఊరిలో... ప్రతి గుడిలో ఉండేలా ఈ నినాదాన్ని అందుకున్నామని సంతోశ్​ తెలిపారు. తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం, జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

ఇప్పటికే 20వేల మొక్కలు సిద్ధం

ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మిచెట్టు కార్యక్రమం మొదలవుతుందని బేగంపేటలో జరిగిన పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఎంపీ ప్రకటించారు. ఇప్పటికే ఇరవై వేలకు పైగా జమ్మి మొక్కలను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. అన్ని గ్రామాలు, ఆలయాలకు వీటిని పంపిణీ చేస్తామన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున చేపట్టిన ప్రతి కార్యక్రమం మాదిరిగానే దీనిని కూడా విస్తృతంగా ప్రచారం చేయటంతో పాటు ప్రతి ఊరిలో ప్రతి గుడిలో జమ్మి వృక్షం ఉండేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్సీ కవిత

పార్క్​ను దత్తత తీసుకున్న హీరో శర్వానంద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.